శ్రీశైలం: మూడు సంవత్సరాలుగా శ్రీశైలంలో కాటేజ్ అప్పజెప్పని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. నోటీసులు జారిచేసిన దేవస్థానం
శ్రీశైలం దేవస్థానానికి చెందిన కాటేజ్‌ను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా వినియోగిస్తున్నట్లు సమాచారం. కాటేజ్‌ను తిరిగి అప్పగించాలని దేవస్థానం అధికారులు ఇప్పటికే మూడు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ నెల 18వ తేదీలోగా కాటేజ్‌ను ఖాళీ చేసి అప్పగించాలని తుది నోటీసు ఇచ్చారు. అలాగే శ్రీశైలంలోని మరో ఆరు కాటేజ్‌లను కూడా అప్పగించాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గడువులోగా కాటేజ్‌లు అప్పగించకపోతే ఈ నెల 20వ తేదీ నాటికి వాటిని స్వాధీనం చేసుకుంటామని దేవస్థానం అధికారులు హెచ్చరించారు.