లోన్ ఇప్పిస్తామని చెప్పి లక్ష రూపాయలతో ఉడాయించిన గుర్తుతెలియని వ్యక్తి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పెన్షన్ లో వ్యత్యాసం ఉండడంతో రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాసులు ట్రెజరీ అధికారులను కలవడానికి ట్రెజరీ కార్యాలయం వద్ద వెళ్లారు. ఓ గుర్తు తెలియని అగంతకుడు ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారిగా శ్రీనివాసులను పరిచయం చేసుకొని శ్రీనివాసులు వద్ద నుంచి లక్ష రూపాయలు తీసుకొని ఉడాయించాడు. మోసపోయానని గ్రహించిన శ్రీనివాసులు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సిసి ఫుటేజ్ ను పరిశీలించారు . ఘటన బుధవారం మధ్యాహ్నం వెలుగులో వచ్చింది ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సింది.