శ్రీశైలం: వేల్పనూరు జమ్మలమ్మ గుడి సమీపంలోని నిప్పుల వాగులో గుర్తుతెలియని మగ శవం లభ్యం
వేల్పనూరు గ్రామం బయట జమ్ములమ్మ గుడి సమీపంలోని నిప్పులవాగులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం బయటపడింది. ఈ రోజు ఉదయం సుమారు 9 గంటల సమయంలో KM పవర్ ప్లాంట్ గేట్ల వద్ద నీటిలో బోర్లా పడి శవం కనిపించగా, గ్రామ వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్యగా అంచనా. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. నీలం రంగు “VEE YEM TEX” ఫుల్ డ్రాయర్ మాత్రమే ధరించి ఉన్నాడు. గుర్తుతెలియని ఈ శవంపై సమాచారం ఉన్నవారు వెలుగోడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ 9121101183 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.