చిలమత్తూరు పాత్రికేయుడు పై దాడిని ఖండిస్తూ హిందూపురంలో నిరసన ర్యాలీ చేసి MRO కు వినతిపత్రం అందజేసిన పాత్రికేయులు
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు ప్రజాశక్తి విలేకరి శంకర్ పై టిడిపి నేత నాగరాజు యాదవ్ దాడి చేయడాన్ని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన ర్యాలీ చేపట్టారు.. టిడిపి నాయకుడు నాగరాజ్ యాదవ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రెస్ క్లబ్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.. పాత్రికేయుడు శంకర్ పై దాడి చేసిన నాగరాజు యాదవ్ అతని కుమారుడిపై కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. అనంతరం తహసిల్దార్ వెంకటేష్ కు వినతి పత్రం అందించారు..