జమ్మికుంట: మాడ్రన్ కబడ్డీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎర్రబెల్లి సంపత్ రావ్ ను ఘనంగా సన్మానించిన యూత్ మండల నాయకులు
జమ్మికుంట: మాడ్రన్ కబడ్డీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎర్రబెల్లి సంపత్ రావ్ ను జమ్మికుంట మండల యూత్ సభ్యులు సోమవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట ప్రాంతానికి చెందిన సంపత్ రావు మాడ్రన్ కబడ్డీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషకరమన్నారు అనునిత్యం యువతకు అన్ని విధాలుగా అండగా ఉండే సంపత్ రావు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల కబడ్డీకి పూర్వ వైభవం తీసుకొస్తారని అన్నారు. సంపత్ రావు నాయకత్వంలో యువకులు ప్రతిభవంతులైనా క్రీడాకారులుగా తయారవుతారని ఆశ భావం వ్యక్తం చేశారు.