ఒంగోలు అర్బన్: మారువేషాల్లో కోడిపందాల స్థావరాలపై దాడులు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు
Ongole Urban, Prakasam | Aug 2, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జి సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఏ ఎస్ ఐ షేక్ మహబూబ్ బాషా మరియు సిబ్బంది దాడులు నిర్వహించారు. సంతనూతలపాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మలంపాడు గ్రామ శివారులో చేపట్టిన దాడిలో కోడి పందేలు ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 కోళ్ళు 7 సెల్ ఫోన్లు Rs9500/- నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై స్థానిక పోలీసులకు, డయల్ 112 కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.