శ్రీశైలం: పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు.