పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామం నందు, పెద్దాపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఆధ్వర్యంలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో పెద్దాపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ బుల్లెమ్మ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బాల్య వివాహాలు మరియు ఇతర చట్టాలు పై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు యొక్క కార్యక్రమంలో విద్యార్థులకు కలిగే ఇబ్బందులు ఇతర ఇతర సమస్యలను ఎదుర్కొనే విధంగా ఉండేందుకు సత్యం ఏ విధంగా ఉపయోగపడుతుంది. అనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివై ఈవో శర్మ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి సూర్యనారాయణ హెచ్ఎం మీనా మాధురి, పెద్దాపురం ఎస్ఐ మౌనిక మండల న్యాయ సేవ అధికారి కమిటీ పాల్గొన్నారు.