మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హిందూపురంలో వైకాపా యువజన విభాగం,విద్ధ్యార్టి విభాగం అద్వర్యలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ జులియేట్, కదిరేష్ మాట్లాడుతూ, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేదలకు విద్య వైద్యం దూరం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. ఫీజులు చెల్లించుకోలేని పేద విద్యార్థులు వారి ప్రతిభ ఆధారంగా నైపుణ్యంతో వైద్య విద్యను అభ్యసించడానికి ఎంతో ఇష్టంగా ఉన్నారని, అయితే ప్రైవేటీకరణ వలన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.