పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (MSP) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.