పెద్దాపురంలో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2.0 లోక కళ్యాణమేల పథక అవగాహన కార్యక్రమం.
కాకినాడ జిల్లా, పెద్దాపురం పట్నం స్థానిక అంబేద్కర్ భవనం నందు కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మెప్మా CMM భ్రమరాంబ అధ్యక్షతన, లోక కళ్యాణమేల కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం నిర్వహించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వానిది 2.0 లోక కళ్యాణ మేళా పథకం ద్వారా వీధి విక్రయా దారులు, చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి పదివేల నుండి 50 వేల రూపాయల రుణం లభిస్తాయని, మెప్మా సీ ఎమ్ ఎమ్ భ్రమరాంబ తెలియజేశారు. ప్రస్తుతం 15000 తీసుకున్నవారికి 25000, 25000 తీసుకున్న వారికి 50,000 ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.