నంద్యాల పట్టణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ శ్రీశైలం మండలంలో YSRCP కార్యకర్తల భారీ ర్యాలి
నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం శ్రీశైలం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత జ్ఞాపక చిహ్నాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమైన, ఖండనీయమైన చర్య అని నాయకులు పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులను వెంటనే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.