ఉండి: ఆకివీడులో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, కలెక్టర్
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు "స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్" కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. బుధవారం ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు "స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్" కార్యక్రమాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంచనంగా ప్రారంభించారు.