నాగులుప్పలపాడు మండలం, ఉప్పుగుండూరు గ్రామంలోని మద్యం దుకాణంలో చోరీ జరిగింది. శనివారం రాత్రి మద్యం దుకాణాన్ని మూసివేసిన తర్వాత గుర్తుతెలియని దుండగులు దుకాణం మెయిన్ డోర్ తాళం పగలగొట్టి రూ. 1,75,000 నగదు దోచుకెళ్ళారు. ఆదివారం షాపు నిర్వాహకులు షాపు తెరిచేందుకు వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. క్యాష్ కౌంటర్ తెరిచి చూడగా, అందులోని నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.