హనుమకొండ: హన్మకొండలో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ టాక్సీలు
దసరా సెలవుల తర్వాత హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ టాక్సీలు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. హన్మకొండ నుంచి ఉప్పల్‌కు ఒక్కొక్కరి నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారని, వైట్ ప్లేట్ కార్లను కూడా రవాణాకు వాడుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.