శ్రీశైలం: శ్రీశైలం వెళ్లడానికి ప్రయాణికులకు సరిపడా బస్సు లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
శ్రీశైలం వెళ్లడానికి ప్రయాణికులకు సరిపడా బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాల నుంచి ఆత్మకూరు మీదుగా శ్రీశైలం వెళ్తుంటారు. అయితే ఆత్మకూరులో బస్సులు ఎక్కువగా ఉంటాయని శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రయాణికులు ఆత్మకూరు వస్తుంటారు కానీ ఇక్కడ సరిపడా భక్తులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు కెపాసిటీ మించి ఎక్కించుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కావున ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మరికొన్ని సర్వీసులు శ్రీశైలం వెళ్లడానికి పెంచాలని కోరుతున్నారు.