శ్రీశైలం: పాములపాడు లో 1.22 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన అదనపు 8ఎం వి ఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించిన విద్యుత్ అధికారులు
నంద్యాల జిల్లా పాములపాడు మండల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రూ.1.22 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎస్‌ఈ సుధాకర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రజలు, రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న 8 ఎంవీఏ, 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్లకు అదనంగా ఈ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అందుబాటులోకి రావడంతో లో వోల్టేజ్ సమస్యలు తగ్గి, నిరంతర విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందన్నారు.