ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ గోదావరి హాస్టల్లో కల్తీ ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు వండిన వంట పాత్రలతో సహా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆహారం నాణ్యత గురించి ప్రశ్నిస్తే సదరు కాంట్రాక్టర్ ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఆహారం అందిస్తున్న కాంట్రాక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.