శ్రీశైలం: నీట్ లికేజీ పై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న దీక్షకు మద్దతుగా ఆత్మకూరులో చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు
నీట్ పేపర్ లీకేజ్ కారణంగా పరిక్ష రద్దు కావడంతో మానసికంగా కృంగిపోయి మృతి చెందిన విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా, ఆత్మకూరులో ప్రముఖ డాక్టర్ నాగన్న ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు కూల్చివేసి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా విద్యావేత్త, ప్రముఖ సామాజిక కర్త డాక్టర్ నాగన్న మాట్లాడుతూ,విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలని కోరుతూ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన ఎన్డీఏ ప్రభుత్వనికి పతనం తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు