అవగాహన కోసమే వికసిత్ భారత్ కార్యక్రమం... వెంకటగిరి నియోజకవర్గ బిజెపి సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు
అవగాహన కోసమే వికసిత్ భారత్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకే వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు అన్నారు. స్థానిక విశ్వోదయ జూనియర్ కళాశాల మైదానంలో వికసిత్ భారత్ డిజిటల్ వ్యాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ రమణయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.