భామిని మండలం పెద్దదిమిలి గ్రామంలో క్రికెట్ ఆట వద్ద యువకుల మధ్య తోపులాట, కొట్లాట
పార్వతీపురం మన్యం జిల్లా, భామిని మండలం, పెద్దదిమిల్లి గ్రామంలో క్రికెట్ ఆట వద్ద ఆదివారం యువకులు మధ్య తోపులాట కొట్లాట చోటు చేసుకుంది. ఓ వర్గానికి చెందిన యువకులు ప్రభుత్వ స్థలంలో క్రికెట్ ఆడేందుకు వెళ్ళగా మరో వర్గానికి చెందిన వ్యక్తులు ఆ స్థలంలో క్రికెట్ ఆడొద్దని వారించగా ఇరువర్గాల మధ్య తోపులాట ఘర్షణ కొట్లాట జరిగినట్లు స్థానికులు తెలిపారు. కులం పేరుతో దూషించి చొక్కాలు చింపి సెల్ ఫోన్ లాక్కొని బెదిరించిన వ్యక్తులను పార్వతీపురం మన్యం జిల్లా ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం జిల్లా అధ్యక్షులు బత్తిని మోహన్ రావు కోరారు.