గన్నవరం: గన్నవరంలో రూ. 36 లక్షలతో వెల్నెస్ సెంటర్: భూమిపూజ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం మండలం కొండపావులూరులో రూ. 36 లక్షల వ్యయంతో వెల్నెస్ సెంటర్కు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భూమిపూజ చేశారు. పేదల సేవలో 2.0 కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థలాన్ని విరాళంగా ఇచ్చిన దాతను ఎమ్మెల్యే సన్మానించారు.