సంగారెడ్డి: బీసీలను అనగదొక్కేందుకే ప్రయత్నం చేస్తున్నారు : బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్
బీసీలను అణగదొక్కేందుకు కొందరు అగ్రకులస్తులు ప్రయత్నిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ఆరోపించారు. సంగారెడ్డిలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈనెల 18 నిర్వహించే బీసీ బంద్ ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు గోకుల్ కృష్ణ, మల్లికార్జున్ పాల్గొన్నారు.