కొడిమ్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో మొదటి సారిగా ఘనంగా కృష్ణపక్ష నవమి తిధి వేడుకలు
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్దల అమావాస్య,బతుకమ్మ పండుగ ముందు వచ్చే సోమవారం కృష్ణపక్షం నవమి తిధి మంగళవారం భద్రపద బహుళ దశమి వేడుకలను వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు 6:48 PM కి 2 రోజులపాటు అత్యంత ఘనంగా నిర్వహించారు,మంగళవారం ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ ప్రధాన ద్వారం ముందు ఉట్టిని కట్టి,EO శ్రీకాంత్ రావు వుట్టిని కొట్టి కృష్ణాష్టమి వేడుకలను జరిపారు,ఈ వేడుకలను తొలిసారి నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు అర్చకులు తెలిపారు,వేద పాఠశాల విద్యార్థులు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,