శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో ఎరువుల దుకాణాల తనిఖీ - తాత్కాలికంగా 91 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాల నిలుపుదల.
ఆత్మకూరులోని మధు ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారిని హేమలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా స్టాక్ బోర్డును అప్డేట్ చేయవలసిందిగా సూచించారు. ఎరువుల నిల్వలను ఈ-పాస్ మిషన్ లో సరి చూశారు. స్టాక్ బోర్డు మరియు ధరల పట్టికను రోజువారి అప్డేట్ చేయాలని తెలియపరిచారు. సరైన ఓ ఫామ్ అనగా ధ్రువీకరణ పత్రాలు గడువు ముగిసినందున రూ 13,84,600 లక్షల రూపాయలు విలువ గల 91 మెట్రిక్ టన్నుల ఎరువులు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు . ఎరువులను ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విక్రయించరాదు అని తెలిపారు .అనుమతి పత్రాలు లేకుండా ఎరువులను విక్రయించరాదని తెలిపారు.