జర్నలిస్టుల ఇళ్లస్థలాల సాధన కోసం గత 12 రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో దీక్షా స్థలంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపైనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం గత 15 రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వానికి, నాయకులకు చీమకుట్టినట్లయినా లేదని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారమయ్యేలా కృషి చేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు