బీజేపీ విధానాలను తరిమికొట్టాలి: సీఐటీయూ
ఐక్య పోరాటాల ద్వారానే బీజేపీ విధానాలను తరిమికొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నరసింగరావు అన్నారు. ఆదివారం విజయవాడ రైల్వే స్టేషన్ ఫారెస్ట్ ఆఫీసర్ స్టాండ్ వద్ద బీజేపీ కూటమి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సమావేశం నిర్వహించారు. మోటార్ రంగం చాలా శక్తివంతమైందని, మోటర్ రంగం కార్మికుల ఎదుట ఉన్న సమస్యలను ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.