మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ నూతన కమిటీతో కలెక్టర్ భేటీ, సేవా కార్యక్రమాలపై కీలక సూచనలు
మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నూతన చైర్మన్ ఎస్. రవికుమార్ మరియు కమిటీ సభ్యులు కలెక్టర్ ఖుష్బూ గుప్తను కలిశారు. రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న సేవలను మరింత విస్తృతం చేయాలని కలెక్టర్ సూచించారు.