అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివార్లలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని బోయ గజిని(20) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పామిడి పట్టణంలోని వెంగమనాయుడు కాలనీకి చెందిన బోయ గజిని రోడ్డు క్రాస్ చేస్తుండగా గుత్తి వైపునకు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో గజిని అక్కడిక్కడే మృతి చెందాడు. యువకుడి మృతి తో పండుగ రోజున ఇంట్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.