గుంటూరు: తురకపాలెం లో సంభవించిన మరణాలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
Guntur, Guntur | Sep 22, 2025 గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో సంభవించిన మరణాలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ గ్రామస్థులు కలెక్టరేట్ కార్యాలయాన్ని సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహాసభవ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకటరావు మాట్లాడుతూ.. మరణాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆర్థిక సహాయంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారులు ఈ అంశాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.