బనగానపల్లె: మహాత్మా గాంధీ ఆశయాలు స్ఫూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్లో శుక్రవారం నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాజీవితంలో ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.