అనంతపురం జిల్లా విడపనకల్లు మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవోగా నంద బుధవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టానని మండల ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తానని డిప్యూటీ ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన నంద ఈ సందర్భంగా పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నంద కు కార్యాలయ ఉద్యోగులు, పలు పార్టీల నాయకులు కలసి గౌరవ సన్మానం చేశారు.