బోధన్: రెంజల్ త్రివేణి సంగమానికి ఉప్పొంగిన వరద నీరు, ఆశ్రమం వరకు నీరు చేరడంతో, సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంఘం గోదావరి బ్రిడ్జి పై నుండి ప్రవహించడంతో నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న సీతారాం త్యాగి మహారాజ్ ఆయన శిష్యులను సురక్షిత ప్రాంతానికి తరలించిన తహసిల్ శ్రావణ్ కుమార్ పోలీస్ శాఖ సిబ్బంది. వర్షాకాలంలో 30 రోజుల్లో మూడవసారి బ్రిడ్జి పైనుండి గోదావరి త్రివేణి సంగమం ప్రవహించడం వలన చుట్టుపక్క గ్రామాలైన బోర్గం తాడు బిలోలి గ్రామాల వారికి హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఆశ్రమంలోని సీతారామ మహారాజ్, వారి బృందాన్ని, అయోధ్య నుంచి వచ్చిన మహారాజులను సురక్షిత ప్రాంతాలకు తరలించామున్నూరు.