సంగారెడ్డి: నర్సాపూర్ మున్సిపాలిటీలోని చైతన్యపురి కాలనీలో కార్డెన్ సెర్చ్, ఎటువంటి పత్రాలు లేని 66 వాహనాలు సీజ్
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్యపురి కాలనీలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్ తో ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులు కనిపించిన పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎటువంటి పత్రాలు లేని 66 వాహనాలను సీజ్ చేసినట్లు డిఎస్పి తెలిపారు. ఈ కార్డెన్ సెర్చ్ లో సిఐలు జాన్ రెడ్డి రామకృష్ణ వెంకటరాజు గౌడ్ తో పాటు నరసాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.