సంగారెడ్డి: ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విశృత ఏర్పాటు చేసినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు.బుధవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు నాగేశ్వరరావు ఉత్తంకుమార్ రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఖరీఫ్ 2025 26 ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్న