శ్రీశైలం: శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కె ఆర్ ఎం బి చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ మరియు కమిటీ సభ్యులు
శ్రీశైలం జలాశయాన్ని కేఆర్ఎంబి చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ ఇద్దరు సభ్యులతో కలిసి పరిశీలించారు. జలాశయం భద్రత, నీటి నిల్వ సామర్థ్యం, రోప్స్, గేట్లు, గ్యాలరీ, ప్లంజ్ పూల్, అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జలాశయం నమూనాను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వ్యూ పాయింట్ వద్ద సమావేశం నిర్వహించిన చైర్మన్, తర్వాత ఏపీ, తెలంగాణ పవర్ హౌస్‌లను సందర్శించి ఇరు రాష్ట్రాల్లో నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తిపై జెన్‌కో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం త్రాగునీటికి ఎటువంటి సమస్య లేదని అధికారులు తెలిపారు.