చంద్రశేఖర పురం: చంద్రశేఖరపురం మండలంలో వైసిపి బలోపేతానికి కృషి చేయాలి: కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్
India | May 5, 2026
చంద్రశేఖరపురం మండలం లో వైసీపీ బలోపేతానికి వైసీపీ నాయకులు , కార్యకర్తలు కృషి చేయాలని కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. చంద్రశేఖరపురం జడ్పిటిసి సభ్యులు మేకల శ్రీనివాసులు యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మండలంలోని బోయమడుగుల గ్రామానికి చెందిన వైసిపి గ్రామ కమిటీల నియామక జాబితాను మంగళవారం నారాయణ యాదవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రశేఖరపురం మండలంలోని అన్ని గ్రామాల్లో వైసిపి ఘన విజయం సాధించేలా ఇప్పటినుండే నాయకులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు.