శ్రీశైలంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు విఐపి బ్రేక్ (స్పర్శ)దర్శనాలు నిలుపుదల ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం
శ్రీశైలం మహాక్షేత్రంలో వేసవి సెలవులు,వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దర్శనాలు విషయంలో మార్పులు చేశారు ఈరోజు నుండి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలు నిలుపుదల చేశారు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు ముందస్తుగా ఆన్లైన్ లో స్పర్శ దర్శనం టికెట్స్ పొందిన భక్తులకు యధావిధిగా స్పర్శ దర్శనం కొనసాగిస్తామని శ్రీస్వామి అమ్మవారి భక్తులందరూ గమనించి దేవస్థానానికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు భక్తులకు కోరారు ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు ఉంటుందని ఈవో తెలిపారు