మణుగూరు: బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో లారీ నుండి విలువైన రెండు బ్యాటరీల చోరీ,కేసు నమోదు
బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక గ్రామంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీ నుండి గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున రెండు విలువైన బ్యాటరీలను దొంగలించారు.. చోరీపై లారీ డ్రైవర్లు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ తెలిపారు..