అమలాపురం: జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
అమలాపురం జడ్పీ కార్యాలయంలో జరుగుతున్న జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. నామినేషన్లు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.