శ్రీశైలం: శ్రీశైలం క్షేత్రంలో జూన్ 8వ తేదీన భారీ స్థాయిలో యోగ కార్యక్రమం: ఈవో రమేష్ నాయుడు
రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమములో భాగంగా జూన్ 8వ తేదీన భారీస్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు EO శ్రీనివాసరావు తెలియజేశారు. యోగా కార్యక్రమానికి ముందస్తుగా జూన్ 6 మరియు 7వ తేదీలలో చంద్రవతి కల్యాణ మండపంలో యోగాశిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయస్థాయిలో పేరొందిన యోగా గురువులచేత ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టబడుతున్నాయన్నారు.