సంగారెడ్డి: శ్రీ వైకుంటపురం ఆలయం భక్తులతో కిటికీట, స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంటపురంలో శనివారం భక్తులతో కిటికీటలాడింది. శ్రీ వైకుంటపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకులు వరదాచారుల ఆధ్వర్యంలో నరసింహ హోమ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.