పలమనేరు: పట్టణం ఎస్.వి.సి.ఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏఐఎస్ఎఫ్ చిత్తూరు ఉపాధ్యక్షుడు సంజయ్ మరియు కార్యవర్గ సభ్యులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. న్యాయం కావాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కళాశాలలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంది దీనివలన ఎంతో మంది పేద వైద్య విద్యార్థులు నష్టపోనున్నారు. డాక్టర్ కావాలనే ఆశ ఉన్నవారు కోట్లు ఖర్చుపెట్టి చదువుకునేవారు ఉండగా పేద విద్యార్థుల ఆశలు అడియాశలు అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు.