శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జూన్ 29న శ్రీ భ్రమరాంబ అమ్మవారికి శాకంభరీ ఉత్సవం
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 29వ తేదీన శ్రీ భ్రమరాంబ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ EO శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై ఈ రోజు నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, స్థానాచార్యులు ,వివిధ శాఖల అధిపతులు, విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా Eo మాట్లాడుతూ, లోకకల్యాణం కోసం నిర్వహించే ఈ పవిత్ర ఉత్సవంలో అన్ని కైంకర్యాలను శాస్త్రోక్తంగా, పరిపూర్ణంగా నిర్వహించాలని వైదిక సిబ్బందికి సూచించారు.అమ్మవారి శాకంభరీ అలంకరణకు అవసరమైన వివిధ రకాల కూరగాయలు, ఏర్పాటు చేయాలని సూచించారు.