కోడుమూరు: గార్గేయపురంలో వైభవంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం, పోటెత్తిన భక్తులు, ఎమ్మెల్యే పూజలు
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గార్గేయపురంలో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. వేడుకను పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై ప్రారంభించారు. భక్తులు స్వామి అమ్మవార్ల నామస్మరణ చేస్తూ రథాన్ని ఉత్సాహంగా లాగారు. వేడుకను పురస్కరించుకొని ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.