సంగారెడ్డి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పై తప్పుడు ప్రచారం చేస్తే సహించం : బిఆర్ఎస్ కంది మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి
ప్రజా నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పై తప్పుడు ప్రచారం చేస్తే సహించమని బీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకున్నా ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.