భీమదేవరపల్లి: ములుకనూరు సహకార సంఘం సేవలు భేష్ హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం లోని ములుకనూరు మహిళా సహకార పాల సంఘం (డెయిరీ), ములుకనూరు సహకార గ్రామీణ పరపతి సంఘంను హనుమకొండ జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాల డియిరీ ని సందర్శించిన కలెక్టర్ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో డెయిరీ ఎప్పుడు ప్రారంభించారు, ఎంత పెట్టుబడి, ఎలాంటి వనరులతో ప్రారంభించారు, గ్రామాలలో పాల సేకరణ ఎలా చేస్తారని, సేకరించిన పాల క్వాలిటీని ఎలా పరీక్షిస్తారని, రవాణా సదుపాయాలు, ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తుంటారని, రోజువారీగా ఎన్ని వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని, మహిళా సంఘాల ప్రతినిధులకు ఎంత ప్రయోజనం కలుగుతుందని, అన్నారు.