గద్వాల్: క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలి: విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరు కావాలని, వెనుకబడిన సబ్జెక్టులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను, మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు.