పార్వతీపురం: పార్వతీపురం నూతన సబ్ కలెక్టర్గా సచిన్ రహర్ బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం డివిజన్ నూతన సబ్ కలెక్టర్గా సచిన్ రహర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 176వ ర్యాంకు సాధించిన ఐఏఎస్ అధికారి. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.