కమలాపురం: నంది మండలం గ్రామ సమీపంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆదివారం కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెల్పిన వివరాల మేరకు నంది మండలం గ్రామ సమీపంలో శివ అనే రైతు తన పొలంలో కరెంటు వేయడంతో షాక్ తగిలి వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం.విషయం తెల్సిన వెంటనే సంఘటన స్థలానికి సిఐ చల్లని దొర, ఎస్సై మధుసూదన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.